హైదరాబాద్ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): మెదక్ ఎంపీ ,దుబ్బాక బీ ఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని మంత్రి టి .హరీష్ రావు తీవ్రంగా ఖండిరచారు. ప్రభాకర్ రెడ్డి పై దాడి అత్యంత గర్హనీయం ప్రజాస్వామ్యం లో హింస కు తావు లేదు .ఈ ఘటనను ప్రభుత్వం బీ ఆర్ ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభాకర్ రెడ్డి కి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించాం. ప్రభాకర్ రెడ్డి కి కత్తిపోటు తో కడుపులో గాయాలయ్యాయి. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ,బీ ఆర్ ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు .అధైర్య పడవద్దు ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం లో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు.
MP పై దాడిని ఖండిరచిన మంత్రి హరీష్ రావు
సోమవారం, అక్టోబర్ 30, 2023
0
Tags