Ticker

6/recent/ticker-posts

Ad Code

MLA పైళ్లను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు

యాదాద్రి అక్టోబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ): యాదాద్రి భువనగిరి జిల్లాలో  బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిలదీస్తున్నారు. తాజాగా.. పోచంపల్లి మండలం, పెద్ద రావులపల్లి గ్రామంలో.. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డిని.. గ్రామ ప్రజలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు, బీసీ బందు లో అక్రమాలు జరిగాయని.. అర్హులను కాదని.. అనర్హులైన ఃఖీూ పార్టీ నాయకులకు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే పైల్ల శేఖర్‌ రెడ్డిని ఒక్కసారిగా గ్రామ ప్రజలంతా చుట్టుముట్టి నిలదీయడంతో.. వారికి సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి పోలీసుల సహాయంతో బైటపడ్డారు. దీంతో.. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు