Ticker

6/recent/ticker-posts

Ad Code

గోషామహల్‌ లో MIM అభ్యర్దిని నిలబెట్టాలి

అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ):ఎమ్మెల్యే రాజాసింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీకు దమ్ముంటే గోషామహల్‌ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్‌ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లబ్ది చేకూర్చేందుకు ఎంఐఎం అభ్యర్థి  గోషామహల్‌ పోటీలో ఉండరు. రేవంత్‌ రెడ్డి కూడా ఇదే అంశాన్ని అసాద్‌ ను అడిగారు. దానికి అసాద్‌ సమాధానం చెప్పలేడు. గోషామహల్‌ లో బిఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడానికి అసదుద్దీన్‌ కారణం. ఆయనకు రావాల్సిన బ్యాగులు వస్తే వారి పేరును ప్రగతి భవన్‌ కు పంపుతారు. ఈ మధ్య అసాద్‌ కొత్త వ్యాపారానికి తెరతీశారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగిన వారి పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టి , బ్లాక్‌ మెయిలింగ్‌ కు పాల్పడుతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో పోటీ కాదు..ఎంఐఎం పార్టీ కార్యాలయం ఉన్న గోషామహల్‌ లో అభ్యర్థిని పెట్టాలని అయన అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు