నాగర్ కర్నూల్ అక్టోబర్ 5 (
ఇయ్యాల తెలంగాణ );తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణి చేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ నాయకులు నాగరాజు అధ్యక్షతన అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తు యువత క్రీడలో రాణించేందుకు కెసిఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో యువత క్రీడలో రాణించి జిల్లాకు రాష్టానికి మంచి పేరు తేవాలని సూచించారు. దసరా పండుగ కనుక మహిళలందరికీ బతుకమ్మ చీరల పంపిణి చేపట్టినట్లు తెలిపారు. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ భవనా లేక ఇన్ని రోజులు అద్దె భవనం లో కొనసాగాయి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక. నూతన తాహశీల్దార్ కార్యాలయం మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. . మైసమ్మ తల్లి ఆశీర్వాదం తో బాచరం గ్రామం లో కె ఎల్ ఐ కాల్వకోసం 36 కోట్ల రూపాయల తో పనులు ప్రారంభించడం జరిగినది. జూనియర్ కాలేజ్ మంజూరు అయింది. బీ ఆర్ ఎస్ చేస్తున అభివృద్ది చూసి ఓర్వలేక పోతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ రేణుక. మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య. మాజీ ఎంపీపీ వెంకటేశ్వర రావు. మైసమ్మ డైరెక్టర్ అశోక్ రెడ్డి. మాజీ సర్పంచ్ జక్కుల నరసింహ తదితరులు పాల్గోన్నారు.
0 కామెంట్‌లు