కేసీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టినా కమలం పువ్వును ఎత్తుకున్న గడ్డ
ఇది భారతీయ జనతా పార్టీ గడ్డ ఈటల రాజేందర్ ను గెలిపించిన గడ్డ
హుజూరాబాద్ గడ్డ విూద అడుగుపెట్టిన రాజనాథ్ సింగ్ కు ధన్యవాదాలు
హుజూరాబాద్ గుండె చప్పుడు ఈటల రాజేందర్
హుజూరాబాద్ అక్టోబర్ 16 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేశాం అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాటం చేశాం. కానీ 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనను చూశాం ఇప్పడు కల్వకుంట్లు కుటుంబ పాలనను చూస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనను చూశాం. ఇప్పుడు కేసీఆర్ పార్టీది అదే విధానం. ఈ పార్టీలు అనేక ఏళ్ళుగా పాలన చేస్తూ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణకు ఏం చేయలేదు. నవంబర్ 30 తారీఖున ఈ రెండు పార్టీల ప్రత్యమ్నాయంగా భారతీయా జనతా పార్టీని మోడీ నాయకత్వాన్ని బల పరుస్తూబీజేపీని గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలను కోరుతున్నాను. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా బీఆర్‌ఎస్ కు ప్రజలు ఓట్లు వెయ్యరు. తెలంగాణ ప్రజలను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.
0 కామెంట్‌లు