నిజామాబాద్, అక్టోబరు (ఇయ్యాల తెలంగాణ ): ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్ వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జనగరÊరaన సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్, ఆయన కుమారుడు,.. ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్‌ఎస్ ) దోచుకుంటోందని అయన ఆరో?పించారు.
కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢల్లీి వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరతామని, కేటీఆర్ను ఆశీర్వదించాలని కోరారని అన్నారు. ఇది రాజరికం కాదని చెబుతూ, భారాసతో పొత్తు పెట్టుకోబోమని ఆ రోజే తేల్చి చెప్పినట్లు మోదీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇందూరు గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భాజపా జనగర్జన సభలో ప్రసంగించారు. ‘‘ ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం ఇవాళ విూకు చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ నన్ను కలిశారు. ఎన్డీయేలో చేరతామని అడిగారు. కేటీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని నేను కేసీఆర్కు గట్టిగా చెప్పా. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, భారాసతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పానని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు భాజపాను ఆశీర్వదించాలని ప్రధాని మోదీ కోరారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకే వినియోగం. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం.నిజామాబాద్ మహిళలు, రైతులకు ధన్యవాదాలు.విూరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. విూ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు
0 కామెంట్‌లు