Ticker

6/recent/ticker-posts

Ad Code

నేడు భారత వైమానిక దళ (INDIAN AIR FORCE) వ్యవస్థాపక దినోత్సవం


భారత వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) ఆవిర్భావమై నేటికి 91 సంవత్సరాలు. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైన ఐఎఎఫ్‌..  మొత్తం ఐదు ఆపరేషనల్‌ కమాండిరగ్‌ కేంద్రాలను కలిగిన ఐఎఎఫ్‌కు 1,130 కంబోట్‌ 1,700 నాన్‌ కంబోట్‌ ఎయిర్‌కాఫ్ట్‌లు ఉన్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాయుసేనగా భారత వైమానిక దళం పేరుగడిరచింది. తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడంలోను, అధునాతన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడంలోను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ముందంజలో ఉండటమే కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైనప్పటికీ.. భారత వైమానిక దళంలోకి తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ను 1933 ఏప్రిల్‌ ఒకటో తేదీన వచ్చి చేరింది. ఆరంభంలో కేవలం ఐదు మంది పైలట్స్‌, ఒక ఆర్‌ఏఎఫ్‌ను కలిగివున్నది. తొలి ఐదుగురు పైలట్స్‌ వీరే..:


ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సుకు తొలి ఐదుగురు పైలట్స్‌గా విధులు నిర్వహించిన ఘనత హరీష్‌ చంద్ర సిర్కార్‌, సుబ్రొతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్‌, అజాద్‌ భక్షా అవాన్‌, అమర్జీత్‌ సింగ్‌లు వైమానిక చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.

ఆ తర్వాత సుబ్రతో ముఖర్జీ తొలి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు.. అంచలంచెలుగా మరింత మంది సిబ్బందిని ఐఎఎఫ్‌ నియమించుకుంది.

వీరిలో అస్పీ ఇంజనీర్‌, కేకె.ముజుందర్‌, నరేంద్ర, దల్జీత్‌ సింగ్‌, హెన్రీ రంగనాథన్‌, ఆర్‌హెచ్‌డి సింగ్‌, బాబా మెహర్‌ సింగ్‌, ఎస్‌ఎన్‌.గోయల్‌, ప్రిత్‌పాల్‌ సింగ్‌, అర్జన్‌ సింగ్‌లు అగ్రగణ్యులు. వీరు వాయుసేనకు అందించిన సేవలు ప్రశంసనీయం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత వాయుసేన క్రీయాశీలక పాత్రను పోషించింది. తొలి వైమానిక దళ దాడి అర్కన్‌ ప్రాంతంలోని జపనీస్‌ సైనిక స్థావరంపై జరిపింది.


 ఈ యుద్ధం తర్వాత ఐఎఎఫ్‌ను అంచలంచెలుగా వృద్ధి చెందింది. యూఎస్‌కు చెందిన వుల్టీ వెంగీయన్స్‌, బ్రిటీష్‌ హాకర్‌ హరీకేన్‌, వెస్ట్‌లాండ్‌ లైసండర్‌ వంటి అధునాతన ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఐఎఎఫ్‌లో వచ్చి చేరాయి. అంతేకాకుండా.. భరతగడ్డపై పొరుగు దేశాలు దాడికి తెగబడినపుడల్లా భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది.  ముఖ్యంగా.. 1960లో ఏర్పడిన కాంగో సంక్షోభ సమయంలోను, 1962లో జరిగి ఇండో`చైనా పోరు సమయంలోను, కాశ్మీర్‌ కోసం 1965లో పాకిస్తాన్‌తో జరిగి యుద్ధ సమయంలోను, 1971లో జరిగిన బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలోను, 1984లో జరిగి ఆపరేషన్‌ మేఘదూత్‌లోను, 1988లో ఆపరేషన్‌ కాక్టస్‌లోను, 1999లో జరిగిన ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ (కార్గిల్‌ వార్‌) సమయాల్లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సేవలు ప్రశంసనీయం.

 గడచిన ఎనిమిది దశాబ్దాల్లో మన వైమానిక దళం సాంకేతికంగా ఎంతోఅభివృద్ధి చెందింది. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. భారత గగన తలంలోకి ఇతర దేశాల విమానాలు చొచ్చుకుని రాకుండా నిరంతరం నిఘా వేస్తోంది. అదే సందర్భంలో దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను రక్షించడానికి, వారికి సహాయం చేయడానికి వైమానికదళం అందిస్తోన్న సేవలు అమోఘం. 90వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఘజియాబాద్‌ లోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ హిందాన్‌ లో జరిగే పెరేడ్‌ లో వైమానిక దళ ప్రధానాధికారి  గౌరవ వందనం స్వీకరిస్తారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు