Ticker

6/recent/ticker-posts

Ad Code

అక్రమ GOLD స్వాధీనం

రంగారెడ్డి అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ): శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు  తనిఖీలు చేసారు.  అరైవల్‌ పార్కింగ్‌ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉప్పు శేఖర్‌ అనే ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీ బ్యాగులో 18 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ) ఒమన్‌ నుండి హైదరాబాద్‌ వచ్చి ఎయిర్పోర్టులో కస్టమ్స్‌ అధికారుల కళ్లు కప్పి నిందితుడు  బయటకు వచ్చినట్లు గుర్తించారు. నిందితుడుని అదుపులోకి తీసుకొని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు