Ticker

6/recent/ticker-posts

Ad Code

హైదరాబాద్‌ ను వదలని FEVER

హైదరాబాద్‌, అక్టోబరు 6, (ఇయ్యాల తెలంగాణ  );హైదరాబాద్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లు, వెక్టార్‌ ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయి.ఇన్‌ఫ్లుఎంజా ఏ, బీ, హెచ్‌3ఎన్‌2, డెంగ్యూ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కేసులు నగరంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.నగరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లు, వెక్టార్‌ ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌ చివరి రెండు వారాల్లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు తార స్థాయికి చేరుకున్నట్లు చెబుతున్నారు. మల్టిపుల్‌ ఇన్‌ఫ్లుఎంజా, ఇన్‌ఫెక్షన్‌ల సాధారణ లక్షణాలను బట్టి చూస్తే డెంగ్యూ కేసులను గుర్తించడం కష్టంగా మారిందని వైద్యులు చెబుతున్నారు.హైటెక్‌ సిటీలోని ప్రముఖ ఆసుపత్రిలో ఇంటర్నల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాహుల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ నగరంలో వైరల్‌ మరియు డెంగ్యూ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు వారి ప్రయాణాలు ఎంత మానుకుంటే అంత మంచిదన్నారు.రద్దీ ప్రదేశం లో ఎక్కువ సేపు ఉండటం, బయట వండిన ఆహారం ఈ కాలంలో అంత మంచిది కాదన్నారు. నివసించే ఇల్లు ఇంటి చుట్టుపక్కల శుభ్రత పాటించాలన్నారు.జ్వరం, జలుబు, దగ్గు, బలహీనత, వికారం, అలసట, శరీరం నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్‌ ను సంప్రదించాలన్నారు.రానున్న నవంబర్‌ నెలలో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజిషియన్‌ మరియు డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ స్పందన కనపర్తి మాట్లాడుతూ ఇటీవల డెంగ్యూ మరియు ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతున్నాయని,చాలా మంది రోగులు జ్వరం, మైల్జియాస్‌ మరియు దద్దుర్లు వంటి లక్షణాలతో ఆస్పత్రికు వాస్తున్నారన్నారు.మూడు రోజులు మరియు అంత కంటే ఎక్కువ రోజులు జ్వరం బారిన పడితే తక్షణమే డాక్టర్‌ ని సంప్రదించి అవసరమైన రక్త మరియు మూత్ర పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లుఎంజా వ్యాధి కొన్ని సందర్భాల్లో న్యుమోనియా మరియు శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుందన్నారు.ప్రతి సంవత్సరం ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదన్నారు. ఇంతకు ముందు కోవిడ్‌ `19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు ఎక్కువగా న్యుమోనియా మరియు ఇతర శ్వాస కొస సమస్యలతో భాద్యపడుతున్నట్లు చెబుతున్నారు.డెంగ్యూ మరియు శ్వాసకోశ అంటువ్యాధులు ఉన్నవారికి కోమోర్బిడ్‌ పరిస్థితులు ఉన్న సందర్భాల్లో అడ్మిషన్‌ మరియు ఇంటెన్సివ్‌ కేర్‌ అవసరమని వైద్యులు చెబుతున్నారు.కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శ్రీ కరణ్‌ మాట్లాడుతూ గత నెలలో తన ఓపిడిలో రోజూ కనీసం 30 జ్వరం కేసులు నమోదయ్యాయని చెప్పారు. డెంగ్యూ విషయానికొస్తే, ట్రాన్స్‌మిసిబిలిటీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంతో పోల్చితే తీవ్రత తక్కువగా ఉందని, ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభ దశలోనే ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారని ఆయన అన్నారు.ముక్కు, చిగుళ్ల వంటి రక్తస్రావమైతే తప్ప డెంగ్యూ సోకిన ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు