హైదరాబాద్, అక్టోబరు 3, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలయింది. ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై పోయాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు 115 నియోజకవర్గాలకు పైగానే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కసరత్తు ఢల్లీిలో కొనసాగుతుంది. ఈరోజో, రేపో తొలి జాబితా విడుదల కానుంది. బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలన్న డిమాండ్ ఆ పార్టీ నుంచి వినపడుతుంది. ఇప్పటికే ఆశావహులు ఢల్లీికి చేరుకుని తమ చివరి ప్రయత్నాలు ప్రారంభించారుఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ముఖ్యనేతలందరినీ శాసనసభ ఎన్నికల బరిలోకి దించేందుకు సిద్ధపడుతుంది. ఎంపీలుగా ఉన్న వారిని అసెంబ్లీకి పోటీ చేయించి గట్టి పోటీ ఇవ్వాలన్న నిర్ణయం ఆ పార్టీ ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ వరస పర్యటనల చేస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్, నేడు నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. తెలంగాణలోనూ అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది.దీంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కమిషన్ అధికారులు మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అధికారులు పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. స్థానిక అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పది మంది అధికారుల బృందం ఇప్పటికే తెలంగాణకు చేరుకుంది. అధికారులతో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించనుంది. జిల్లా కల్లెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులపై ఎన్నికల కమిషన్ అధికారులు చర్చించనున్నారు.
0 కామెంట్‌లు