హైదరాబాద్ అక్టోబర్ 18 (
ఇయ్యాల తెలంగాణ );కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు చేశారు. ఆయన రాహుల్ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ అని సెటైర్ వేశారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి గురించి ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కాదు, సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని సవాల్ విసిరారు.
0 కామెంట్‌లు