ఖమ్మం అక్టోబర్ 28 (ఇయ్యల తెలంగాణ ):ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్ లో కాంగ్రెస్ ప్రచార కో కన్వీనర్ పోంగులేటి శ్రీ నివాసరెడ్డి విూడియాతో మాట్లాడారు. రెండవ విడుత బస్సు యాత్ర తాండూర్ లో డికె శివకుమార్ నేతృత్వంలో ప్రారంభం అవుతుంది. ఎఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే రేపు పాల్గొంటారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తొమ్మిది న్నర సంవత్సరాలు కేసీఆర్ పాలన హావిూ లు అమలు పై ప్రచారం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది..ఆరు గ్యారంటీ లు పై ప్రచారం సాగుతుంది. తొలి విడుత యాత్ర రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగిందని అన్నారు.పాలేరు సభలో సీఎం కేసీఆర్ అనేక అవాకులు, చవాకులు పేలారు. పేరు ప్రస్తావించికపోయనా...నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. వేదిక సాక్షి గా ....కేసీఆర్ డబ్బు ఉందిగా అనే మదంతో ..నోట్ల కట్టలతో ప్రజా స్వామ్యం అపహాస్యం చేస్తున్నారు. విూ పక్కన కూర్చున్నోళ్లు ఏ పార్టీ నుండి గెలిచారు... ఎంత ప్యాకేజీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం ను అపహాస్యం చేస్తూ... ప్రజలు నవ్వు కునేలా చేసింది ఎవరు. ప్రజాస్వామ్యం ...డబ్బు ల కట్టలు గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. మసిపూసి మారెడు కాయ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర తో పాటు జాతీయ రాజకీయ లలో డబ్బు మదంతో అహాంకారంతో మాట్లాడేది విూరా. నాలుగు కాంట్రాక్టు లు చేశో..పైరవీలు చేశో డబ్బు సంపాదించి..విూకు ఛాలెంజ్ చేస్తున్నా తడి బట్టలతో వస్తా.. ఏ గుడి కి ఎప్పుడూ వస్తారో రాండి నేను వస్తా. దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఓటమి భయం తో మొదలు పెట్టారు. విూకు దళిత బంధు పథకం తీసుకున్న ఓట్లు పడ లేదు. సత్తుపల్లి, పాలేరు సభలో దళిత బంధు పథకం అమలు చేస్తారా. రాష్ట్రంలో ఎక్కడా దళితులు లేరా. విూరు ఇచ్చింది నియోజకవర్గం కి వంద...ఇది విూ చిత్తశుద్ధి. కాంగ్రెస్ మ్యాన్ ఫేస్టో ను చూసి ...బిఆర్ఎస్ మ్యాన్ ఫేస్టో. విూరు రెస్ట్ తీసుకోకపోతే ఏం చేస్తున్నారు.... మూడు రోజులే సోళ్ల కబుర్లు కి కేటాయిస్తున్నారు. ప్రజల ముఖ్యమంత్రి గా ఉండటం లేదు కేసీఆర్. అక్రమంగా సంపాదించిన డబ్బు ..నోట్ల కట్టలతో వస్తున్నారు.. డబ్బు సంపాదించి న...నీతిగా...నిజాయితీ గా సంపాదించా...ట్యాక్సీ లు కట్టి... మిగిలిన డబ్బు తో రాజకీయం చేస్తున్నానని అన్నారు.
ఏ గుడి అయిన సరే.. నేను వస్తా? CM KCRకు పొంగులేటి సవాల్
శనివారం, అక్టోబర్ 28, 2023
0
Tags