Ticker

6/recent/ticker-posts

Ad Code

CM KCR ఆరోగ్య పరిస్థితి పై బులిటెన్‌ విడుదల చేయాలి BJP సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ ): : సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేయాలని బీజేపీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్‌పై కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌ను ఒత్తిడి చేస్తున్నారు. తమ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుంది. సీక్రెట్‌గా ఉంచడం వల్ల కాన్షీరాం, జయలలిత ఆరోగ్యం ఏమైందో అందరికీ తెలుసు. కాన్షీరాం, జయలలిత మరణాలపై పలు అనుమానాలున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం బులిటెన్‌ విడుదల చేసేలా సీఎస్‌కు ఆదేశాలివ్వాలని గవర్నర్‌కు లేఖ రాశాను’’ అని మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు