Ticker

6/recent/ticker-posts

Ad Code

శ్రీవారిని దర్శించుకున్న C M KCR భార్య శోభ

తిరుమల అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతిమణీ శోభ మంగళవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన భర్త ఆరోగ్యం కోసం స్వామిని మొక్కుకుని, తలనీలాలను సమర్పించారు. సోమవారం ఆమె తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి అర్చన సేవలో పాల్గొనిస్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శోభకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యేచెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు