నెల్లూరు అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ): కావలి వద్ద కొందరు అనుమానిత వ్యక్తులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేయడాన్ని సంస్థ ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమలరావు తీవ్రంగా ఖండిరచారు. అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులుపై చట్ట పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బెంగుళూరు నుండి విజయవాడ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బి.ఆర్.సింగ్ పై టీఎన్ 9 సి 1612 నంబర్ గల కారు డ్రైవర్, కారులో వ్యక్తులు భౌతికంగా దాడి చేసారని అయన అన్నారు. దాడికి దిగిన వ్యక్తులపై కావలి పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపిన కావలి పోలీసులు, అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ప్రజల మద్య విధులు నిర్వహించే ఆర్టీసి కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు చట్ట పరంగా తీసుకుంటామని ఆర్టీసీ ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు