హైదరాబాద్ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ):కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. ఆశాభంగం చెందిన సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అసంతృప్తి నేతలు అధికార పార్టీలో చేరుతుననారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికెళ్లి మరీ అయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో నాగం ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసారు. నాగం లో పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం కేసీఆర్ నాగంకు హావిూ ఇచ్చినట్లు సమాచారం. అలాగే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిపారు. సోమవారం నాడు మంత్రి హరీష్ రావు విష్ణువర్ధన్ రెడ్డిని అయన నివాసంలో కలిసారు. పాలమూరు కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ కు గులాబీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేత పీ చంద్రశేఖర్ కుడా బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.
BRSలోకి..కాంగ్రెస్ వరుస వలసలు
సోమవారం, అక్టోబర్ 30, 2023
0
Tags