సంగారెడ్డి అక్టోబర్ 2 (
ఇయ్యాల తెలంగాణ) : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకుందే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని స్పష్టం చేశారు.దేశంలో ఎక్కడైనా ఉచితంగా పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఉచితంగా ఇస్తున్నారా? ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు నిరూపిస్తే వెంటనే నా పదవికి రాజీనామా చేస్తానని ప్రతి పక్షాలకు సవాల్ విసిరారు. ఇల్లు లేని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం కోసం లక్ష ఇండ్లు నిర్మించాం. అవసరమైతే మరో లక్ష ఇండ్లను నిర్మిస్తాం. ఎవరు కూడా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు