Ticker

6/recent/ticker-posts

Ad Code

మేడ్చల్‌ నియోజకవర్గం BRS ప్రజా ఆశీర్వాద సభలో KCR


మేడ్చల్‌ మల్కాజ్‌గిరి అక్టోబర్‌ 18  (ఇయ్యాల తెలంగాణ ); హైదరాబాద్‌ నగరానికి సవిూపంలో ఉన్న మేడ్చల్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మేడ్చల్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలు మినీ భారతదేశాలు.. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఉంటారు అని కేసీఆర్‌ తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.ఈ నియోజకవర్గానికి డబుల్‌ బెడ్రూం ఇండ్లు 26 వేల వచ్చాయని ఇప్పుడే మల్లారెడ్డి చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇండ్లను అందించాం. ఇటీవలే ప్రకటించిన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రావిూస్‌ చేశాం. మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు కడుతాం. బ్రహ్మాండమైన పద్దతుల్లో 10 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇది కొనసాగాలి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.ఇక ఆపద మొక్కులు మొక్కే నాయకులు వస్తారు.. ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుతారు.. వాగ్దానాలు చేస్తారు అని కేసీఆర్‌ విమర్శించారు. ఎవరు మనల్ని ముంచారు. ఉన్న తెలంగాణను ఊరడగొట్టిందేవరు..? 50 ఏండ్లు మనల్ని రాచి రంపాన పెట్టిందేవరు..? మనం తిరుగుబాటు చేసిన నాడు తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందేవరు..? కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్‌ బాధలు వస్తాయి. పరిశ్రమలు దెబ్బతింటాయి. అందరికీ మేలు చేసే బీఆర్‌ఎస్‌ పార్టీకి అండదంగా ఉండాలి. ఆపదమొక్కులు మొక్కే వారు వస్తరు. వారిని నమ్మొద్దని కేసీఆర్‌ కోరారు.కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుంటే, రైతులు ఏడుస్తుంటే మనల్ని ఎవరు పట్టించుకోలేదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ రోజు కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల పూర్తవుతున్నాయి. సాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. మంచినీళ్ల బాధ కూడా పోయింది. మేడ్చల్‌ నియోజకవర్గంలో మంచినీళ్ల ఏర్పాటు చేసుకున్నాం. ఎల్‌బీనగర్‌, మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌ మినీ బారతదేశాలు. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. మన రాష్ట్ర ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు. ఏడాదికి ఏడాదికి నగరం పెరిగిపోతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెంచుతాం. సెపరేట్‌ బడ్జెట్‌ పెట్టి చర్యలు తీసుకుంటాం. మంచినీళ్లు, సీవరేజ్‌, కరెంట్‌ వసతులు పెరుగుతూ పోవాలి. అభివృద్ధి జరగాలి. గొప్ప నగరంగా ఉంటుంది. మల్లారెడ్డి కోరిన నిధులు అందజేస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు