Ticker

6/recent/ticker-posts

Ad Code

నక్కనపల్లిలో చిరుత సంచారం

చిత్తూరు అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ): ఇప్పటికే తిరుమల కాలినడకన వెళ్లే భక్తులను భయ భ్రాంతులకు గురి చేసిన ఘటన మరవక ముందే చిరుత సంచరించిన మరో ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.చిత్తూరు జిల్లాలోని నక్కనపల్లి గ్రామంలో చిరుత సంచారం అక్కడ ప్రజల్లో కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా చిరుత స్థానికంగా ఉండే కుక్కను వేటాడుతుండగా గుర్తించారు స్థానికులు. మవత్తూరు గ్రామ సవిూపాన పాల ఆటోకి అడ్డుగా వచ్చిన చిరుతను సెల్‌ ఫోన్‌ చిత్రీకరించిన ఆటో డ్రైవర్‌. నిన్న పక్కనే ఉన్న కర్ణాటకలో చిరుతపులి ఉంది అని ప్రచారం..పులి సంచారంతో స్థానికులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు.ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకొని చిరుత జాడలపై అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఒంటరిగా తిరగరాదరని హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు. అటు పూతలపట్టు మండలం, చిటిపిరాళ్ళ వద్ద చిరుత సంచారం.చిరుత సంచారంతో భయాందోళనకు గురి అవుతున్న ప్రజలు..చిటిపిరాళ్ళ గురుకుల పాఠశాల వెనుక ప్రాంతం వైపు ఎవరూ వెళ్ళదంటూ దండోరా వేయించారు గ్రామస్థులు. సంఘటన స్ధలంకు చేరుకుని చిరుత పాదముద్రలను సేకరిస్తున్న అటవీ శాఖ అధికారులు.చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు  కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు