న్యూఢల్లీ అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ): దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, నామినేషన్ల . పరిశీలన నవంబర్ 13, నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ నవంబర్ 15. ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 న జరుగుతాయి. రాష్ట్రంలో 35,356 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.తెలంగాణలో 6,10,694 ఓట్లు తొలగించామని అయన వెల్లడిరచారు..
0 కామెంట్‌లు