కరీంనగర్, అక్టోబరు 18, (ఇయ్యాల తెలంగాణ ); సాఫీగా సక్సెస్ ఫుల్ గా.. అంతకుమించిన ప్రోగ్రెసివ్ గా సాగిపోతున్న జీవితంలో..అనూహ్యమైన కుదుపులు వస్తే.. ఆ భావోద్వేగం వర్ణనాతీతం.అదిగో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ పరిస్థితే ఎదుర్కొంటున్నారా..? కేంద్రమంత్రి సభ సాక్షిగా.. గతంలో తాను మంత్రిగా ఏంచేశానో చెప్పుకుంటూ.. ఒకిన్ని కార్యక్రమాలు మిస్సైపోయానన్న బాధను కనబర్చారా..? లేక, అప్పట్లో సర్కారు సహకరించలేదన్న ఆ కసి ఇంకా రగులుతూనే ఉందా..? మొత్తంగా సదరు నేత మాటల్లో ఎప్పుడూ అలాంటి మిక్స్ డ్ ఎమోషన్స్ క్యారీ అవుతూనే ఉంటాయి.మరి ఎన్నికల వేళ మరోసారి అలా బరస్టైన ఆ నేతెవరో విూరే చూడండివాయిస్ తాను ఆర్థికమంత్రిగా ఉండగా ఏం చేశాను... తాను ఆరోగ్యమంత్రిగా ఉండగా ఏంచేశాను... తాను ఏవిషయంపై వద్దని వారిస్తే ముఖ్యమంత్రికి నాడు కోపం వచ్చింది... తన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థికి అర్హులెవరనే చర్చ వస్తే తన పేరు రావడమే సీఎం గుస్సాకు కారణమా...? ఇదిగో ఇలాంటి అన్ని విషయాలూ జమ్మికుంట సభలో చర్చించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరైన ఈ సభకు భారీగా జన సవిూకరణ చేయగా.. ముఖ్య అతిథి కంటే ఈటలే ఎక్కువ మాట్లాడారు. ఆ మాట్లాడినదాంట్లో ఎన్నికల్లో తమనెందుకు గెలిపించాలి.. బీజేపీని గెలిపిస్తే ఏంచేస్తామనే అంశాల కంటే.. గతంలో తాను మంత్రిగా చేసినప్పటి సిచ్యువేషన్స్.. తాననుభవించిన పెయిన్ ను ప్రజల ముందుంచి మరోసారి సానుభూతి గెయిన్ చేసే యత్నం చేశారన్న వాదన సభలో వినిపించింది ... అయితే, ఈటల ప్రసంగం ఆసాంతం విన్న ప్రజలు.. ఆ తర్వాత ముఖ్య అతిథి రాజ్ నాథ్ ప్రసంగం సమయంలో ప్రాగంణంలో దాదాపు ఎవ్వరూ లేకుండా ఖాళీ అవ్వడమూ చర్చనీయాంశంగా మారింది. ఈటల మాటల్లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏంచేశానో చెప్పుకుంటున్న తరుణంలో... తాను ఆ స్థానాన్ని కోల్పోవడంపై ఒకింత అంతర్మథనం కనిపించింది. అదే సమయంలో.. ప్రోగ్రెసివ్ గా సాగుతున్న సక్సెస్ ఫుల్ జర్నీకి అర్ధాంతరంగా బ్రేక్ వేసిన వారిన కచ్చితంగా నేలకు దించాల్సిందేనన్న కసి కనిపించింది ... మొత్తంగా ఎప్పుడూ విభిన్నంగా.. కాస్తా లోతుగా.. మర్మగర్భంగా మాట్లాడే ఈటల జమ్మికుంట సభలో ఆ విధంగా బరస్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది..అయితే, హుజూరాబాద్ లో అధికారపార్టీ ఎంత చేసినా... చాలాకాలంగా ఈటల నియోజకవర్గానికి కాస్త దూరమయ్యారన్న చర్చలు జరిగినా... నేటికీ అదే క్రేజ్ మాత్రం ఈటెల విషయంలో కనిపించడం.. ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకోవడం ఓ విజయవంతమైన నాయకుడి గొప్ప లక్షణమనే అభిప్రాయం వ్యక్తమైంది... అయితే, ఇంకా తన పాత జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్న ఆ భావోద్వేగాలు .. ఇంకా ఈటలలో ఆ పాత వాసనలుండటం పట్ల మాత్రం జనంలో చర్చకైతే తెర లేపుతోంది.
0 కామెంట్‌లు