ముంబై అక్టోబర్ 3 (ఇయ్యాల తెలంగాణ ): అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి ఐదేళ్ళు అవుతోంది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్‌టబ్‌లో విగతజీవిగా కనిపించడం షాక్‌కు గురి చేసింది. తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి మరణం గురించి కొన్ని కీలక అంశాలు చెప్పారు.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బోనీ కపూర్ మాట్లాడుతూ ’’శ్రీదేవిది నేచురల్ డెత్ కాదు. యాక్సిడెంటల్ డెత్. ఆమె మరణానంతరం దుబాయ్ పోలీసులు నన్ను 24 గంటలపాటు విచారించి, లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. ఇండియన్ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి విచారణ చేసిన అనంతరం ఆమెది యాక్సిడెంట్ డెత్ అని నిర్ధారించారు’’ అని చెప్పారు బోనీ కపూర్ ఇదే సమయంలో శ్రీదేవి ఆరోగ్యం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బోనీ. తెరపై అందంగా కనిపించడానికి ఆమె ఎప్పుడూ డైట్‌లో ఉండేవారట. ఉప్పు లేని ఆహారం తీసుకునేవారట. ఇది మంచిదికాదని వైద్యులు చెప్పినప్పటికీ ఆ సూచనలు వినేవారుకాదట. అంతేకాదు శ్రీదేవి బీపీ సమస్యతో ఇబ్బందిపడేవారట. శ్రీదేవికి బ్లాక్ అవుట్స్( స్పృహ కోల్పోవడం, కళ్ళు తిరిగిపడిపోవడం) ఉండేవట. ఆమె బ్లాక్ అవుట్స్ బారిన పడిన పలు సందర్భాల్లో వున్నాయిని’ చెప్పుకొచ్చారు బోనీకపూర్.1996లో శ్రీదేవి బోనీ కపూర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్. శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
0 కామెంట్‌లు