నిజామాబాద్, అక్టోబరు 10 (ఇయ్యాల తెలంగాణ );నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలోనే కల్లుగీత కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. 70 వేల కుటుంబాలకు ఉపాధి పొందారని, కల్లుగీత కార్మికుల భీమా ను 5 లక్షలకు పెంచామననారు కవిత. అంతేకాకుండా.. 2014 తర్వాత కల్లుషాపు లను పునరిద్దరించి ఈత, తాటి వనాలు ప్రోత్సహించామని, మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పాలనలో బీసీ లకు అన్యాయమన్నారు. బీసీలకు హాస్టళ్లు లేవని, డిగ్రీ కాలేజీ లు లేవని, తెలంగాణలో 7 లక్షల మంది బీసీ లకు కల్యాణ లక్ష్మీ వర్తింపజేశామన్నారు. మాది బీసీ ల ప్రభుత్వమని ఎమ్మెల్సీ కవిత ఉద్ఘాటించారు.అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గీత కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతున్నదని ఆమె అన్నారు. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు కవిత. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వాల కాలంలో నిజామాబాద్ నుంచి ఎంతో మంది పెద్ద నాయకులు పనిచేశారన్నారు. జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉండేదని, అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టల్స్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీజు రింయంబర్స్ మెంట్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవితి తెలిపారు.
0 కామెంట్‌లు