రంగారెడ్డి అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులు, బాధితులతో హూజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్,పార్టీ నేత తల్లోజు ఆచారి మంగళవారం సమావేశమయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే లాక్కొన్న భూములు తిరిగి ఇస్తామని హావిూ ఇచ్చారు ఈటల రాజేందర్. కందుకూరు మండలంలో అన్నివనరులున్నా... అధికార యంత్రాంగం ఆదరణ లేక వెనకబడిరదన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు మాట్లాడుతూ మా భూములు లాక్కొన్ని కోట్ల రూపాయలకు అమ్మేఅధికారం ఎవడిచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా స్థలాల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్స్ మాకే కాకుండా పాతబస్తీవాసులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, కన్వీనర్ దేవేందర్ రెడ్డి, , కందుకూరు మండలం ఎంపీపీ మందా జ్యోతి పాండు, అధ్యక్షులు అశోక్ గౌడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు,ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
0 కామెంట్‌లు