మేడ్చల్ అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ): సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అయనను మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నానని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నన్ను గల్లీ నుంచి ఢల్లీికి పంపించడంలో నియోజకవర్గ ప్రజల శ్రమ ఉంది. పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు. మామ, అల్లుళ్లకు బుద్ది చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారు. ఇక్కడి ప్రజలకు, ఈ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పించే బాధ్యత మాది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్ గా మారుస్తాం. మెట్రో రైలును ఈ ప్రాంతానికి పొడగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సుధీర్ రెడ్డి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తాం
టికెట్ రానివారి ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను. ఎవరిపై మాకు ద్వేషం లేదు. అందరినీ కలుపుకుని పనిచేయాలి. ముందున్న లక్ష్యాన్ని చూడండి.. కార్యకర్తల కష్టాలు చూడండి. కాంగ్రెస్ ను గెలిపించండని అన్నారు.
0 కామెంట్‌లు