రంగారెడ్డి అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్, పీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంగళ్ రావు పార్టీకి రాజీనామా చేసారు. కూకట్ పల్లి నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ గొట్టిముక్కల వెంగళ్ రావు ఆశించిన విషయం తెలిసిందే. శుక్రవారం విడుదలైన కాంగ్రెస్ పార్టీ 2 వ లిస్ట్ లో కూకట్ పల్లి నుండి పార్టీ అభ్యర్థిగా బండి రమేష్ ను అధిష్టానం ప్రకటించింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కి వెంగళ్ రావు రాజీనామా చేసారు. వెంగళరావు విూడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి రమేష్ కి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లో అడ్డుకుంటామని అయన అనుచరులు వెల్లడిరచారు.బండి రమేష్ గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు.
కూకట్ పల్లిలో కాంగ్రెస్ కు సీనియర్ నేత రాజీనామా
శనివారం, అక్టోబర్ 28, 2023
0
Tags