Ticker

6/recent/ticker-posts

Ad Code

పవన్‌ కళ్యాణ్‌ కు పోలీసుల నోటీసులు

మచిలీపట్నం అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ ):జనసేన అధినేత పవన్‌ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడిరచారు. ‘పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చాం. దాడులు జరగుతాయనే సమాచారం విూకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్‌ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారు.సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు.బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు ఎస్పీ జాషువా. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు