Ticker

6/recent/ticker-posts

Ad Code

ఎన్నికల కమిషన్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం అధికారులు , సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

 

జగిత్యాల అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ): రాబోయే శాసనసభ ఎలక్షన్స్‌ కు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు  నిర్వహణలో పోలీస్‌ ల పాత్ర  చాలా కీలకమైందని జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌  అన్నారు.బుధవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం లో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి అధికారులు తీసుకోవలసిన చర్యలపై  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ...  శాసనసభ ఎలక్షన్స్‌ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషనర్‌ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఎలక్షన్స్‌ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్‌ ముందు, ఎలక్షన్‌ రోజు, ఎలక్షన్‌ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్‌ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, సమస్యాత్మకమైన గ్రామాల్లో తరచూ సందర్శించి నిఘా ఉంచాలని అన్నారు. రోజు పోలీస్‌ స్టేషన్‌ ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించి నగదు, గోల్డ్‌, ఇతర వస్తువులను సీజ్‌ చేసి జిల్లా  ఎన్నికల కమిటీకి అప్పగించాలని అన్నారు. గ్రామాల్లో బెల్ట్‌ షాప్‌ నిర్వహకులపై , గుడుంబా తయారీ దాడులపై డైనమిక్‌ తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని బైండోవర్‌ చేయాలని,

 గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా బ్లూ కోల్ట్‌ సిబ్బంది,అధికారులు తరచు పర్యటిస్తూ  విసిబుల్‌ పొలిసింగ్‌ అమలు చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 22,71,446 రూపాయల నగదు సీజ్‌ చేయడం జరిగిందని, అదేవిధంగా 12,26,577 రూపాయల విలువ గల 2,564 లీటర్ల మద్యం సీజ్‌ చేయడం జరిగిందని అన్నారు.ఇంతకు ముందు ఎలక్షన్స్‌ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. చెక్‌ పోస్టు ల దగ్గర, ఇతర ప్రదేశాలలో తనిఖీలలో  విడియో కవరేజ్‌ చేయటం, క్యాష్‌ , లిక్కర్‌ ,ఇతర వస్తువులు పట్టుబడినప్పుడు ఎన్నికల  కవిూషన్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం సంభందిత అధికారులు అనుసరించాల్సిన విధివిధానాల పై తగు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్‌ సమయంలో ర్యాలీలు, విూటింగ్‌ లకు ఎన్నీకల నిబంధనలకు లోబడి అనుమతులు పై పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయం కావున వీఐపీలు ఎక్కువగా జిల్లాకు వస్తారు బందోబస్తుకు సంబందించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. ఎలక్షన్‌ కి సంబంధించి నమోదు చేసే కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన అవగాహనతో కేసులను నమోదు చేయాలని సూచించారు.ప్రచార వాహనాలకు, ఎన్నికల ర్యాలీలకు, సభలకు అనుమతులు పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. లాంగ్‌ పెండిరగ్‌ లో ఉన్న ఎన్డీ డబ్ల్యూఎస్‌ ను త్వరగా సర్వ్‌ చేయాలనీ జిల్లా ఎస్పీ పోలీస్‌ అధికారులకు సూచించారు.ఈ సమావేశంలోఅడిషనల్‌ ఎస్పీ లు ప్రభాకర రావు, భీంరావ్‌,  డిఎస్పీలు రవీంద్ర కుమార్‌ వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, సురేష్‌ డీవి  రంగారెడ్డి ,ఎస్భీ,సీసీఎస్‌ ఐటీ కోర్‌ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ లు,సి.ఐ లు, ఎస్‌.ఐ లు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు