విద్యుత్ స్తాంభాన్ని డీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు
సోమవారం, అక్టోబర్ 30, 2023
0
రంగారెడ్డి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి 263 పిల్లర్ వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కోట్టింది. ఘటనలో కారు లో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు అయ్యయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితివిూరిన వేగం, డ్రైవర్ నిద్ర మత్తు లో జారు కోవడంతో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags