మెదక్, అక్టోబరు 10, (ఇయ్యాల తెలంగాణ );కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ లలో రాష్ట్ర షెడ్యూల్ కూడా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వర్గాలను అలజడి మొదలైంది. దీంతో సరిహద్దు చెక్ పోస్టులను పటిష్టపరిచేందుకు పోలీసు, ఎక్సైజ్ తదితర శాఖల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంతో పాటు మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్కల్ మండలాలకు ఆనుకుని ఉన్న కర్ణాటక సరిహద్దు ఉంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఆరు ప్రధాన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గానికి అష్ట దిగ్బంధం చేసినట్లయింది. ఎన్నికలు ముగిసే వరకు సరిహద్దుల్లో పటిష్ట నిఘా నిరంతరం కొనసాగనుంది. లోగడ నిర్వహించిన సరిహద్దు సమావేశాలు ఎన్నికల వేళ సత్ఫలితాలను ఇవ్వనున్నట్లు డీఎస్పీ రఘు పేర్కొన్నారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రహదారిలో కోహీర్ రహదారిలో మనియార్ పల్లి వద్ద చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయగా మల్చల్మే రహదారిలో సిద్దాపూర్ వద్ద, జాతీయ రహదారి 65 పై మాడ్గి వద్ద, బీదర్ రోడ్డులో హుసెళ్లి వద్ద, న్యాల్కల్ బీదర్ రోడ్డులో డప్పూర్ వద్ద , మొగుడంపల్లి దారిలో గౌసాబాద్ వద్ద ఏర్పాటు చేశారు. వీటితోపాటు చొరబట్లకు అవకాశం, నేరాలకు ఆస్కారం ఉన్న బూచినెల్లి , రాజోలా తదితర బార్డర్లలో ప్రాంతాల్లో కూడా నిఘా సమాచార కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.కర్ణాటక సరిహద్దు ప్రాంతం కలిగిన జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఆవిర్భవించాయి. జహీరాబాద్ నియోజకవర్గ కర్ణాటక సరిహద్దుకు అనుకొని ఉండడంవల్ల అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడివారు ఎక్కడికి సులువుగా రాకపోకలు చేస్తుంటారు. ఈ సందర్భంలో అక్రమ మధ్యం, డబ్బు, తదితరాలు రవాణా చేసేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా ఎన్నికలను ప్రభావితం చేసే సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులు, పాత నేరస్తుల రాకపోకలు ఓటర్లను ప్రభావితం చేసే ఇతర శక్తులు కూడా నియోజకవర్గంలోకి ప్రవేశించేందుకు ఆస్కారం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రౌండ్ ది క్లాత్ గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఆయా చెక్ పోస్ట్ లో డివిజనల్ స్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు కూడా ఆయా చెక్ పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని సమాచారం. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లతో ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలు, అవసరమైన సూచనలు చేసినట్లు సమాచారం. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలతో పాటు విశ్వసనీయ సమాచారం, ఉన్నతాధికారులు, టోల్ ఫ్రీ ద్వారా సమాచారం వచ్చిన వాహనాలను కూడా నిరంతరం తనిఖీ చేసేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో రెండుసార్లు జిల్లా స్థాయి బార్డర్ క్రైమ్ విూటింగ్ లు నిర్వహించారు. ఈ క్రైమ్ విూటింగ్లలో కూడా నేరస్తుల గురించి చొరబాట్లు, అక్రమాల నిరోధాలపై చర్చించి పరస్పర సహకరించుకునేలా చర్చలు జరిగాయి.
0 కామెంట్‌లు