Ticker

6/recent/ticker-posts

Ad Code

వరంగల్‌ లో ట్రయాంగిల్‌ ఫైట్‌

వరంగల్‌, అక్టోబరు16, (ఇయ్యాల తెలంగాణ ); వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట్‌ నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. నర్సంపేట, చెన్నరావుపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ. మొత్తం ఓటర్లు 2,18,293. వీరిలో పురుషులు 1,08,019, మహిళలు 1,10,271 ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌  అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు 76,144 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డికి 57,768 ఓట్లు పడ్డాయి. 2014లో కాంగ్రెస్‌ టిక్కెట్‌  రాకపోకవడం.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు మాధవరెడ్డి. 2014లో గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ లో చేరారు. ఇక.. 2018 ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాదవరెడ్డిపై 16,949 ఓట్ల మెజార్టీతో  గెలిచారు. సుదర్శనరెడ్డికి 94,135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77,186 ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో కూడా పెద్ది సుదర్శన్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌.పరకాల నియోజకవర్గం... ఇక్కడ మొత్తం ఓటర్లు 1,77,098. వీరిలో పురుషులు 89,594. మహిళా ఓటర్ల సంఖ్య 89,594. గత రెండు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చల్లా దర్మారెడ్డి విజయం సాధించారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన చల్లా ధర్మారెడ్డి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి సవిూప కాంగ్రెస్‌ ప్రత్యర్థి.. మాజీ మంత్రి కొండా సురేఖపై 46,519 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ధర్మారెడ్డి 1,05,903 ఓట్లు సాధించగా.. కొండా సురేఖకు 59,384 ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన కొండా సురేఖ... 2018 ఎన్నికల ముందు పార్టీ  నాయకత్వంపై అలిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ తరఫున పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా చల్లా ధర్మారెడ్డికే బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.తూర్పు వరంగల్‌ నియోజకవర్గంలో ఉన్నది రెండే మండలాలు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,11,660. వీరిలో పురుషులు 1,03,981. మహిళలు 1,07,677. వరంగల్‌  తూర్పు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత మాజీ  మంత్రి కొండా సురేఖ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు కొండా సురేఖ. మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను 55,085 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు టికెట్‌ ఇవ్వలేదు. అప్పుడు మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేందర్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి విజయం  సాధించారు. 2018 ఎన్నికల్లో నరేంద్రకు 83,922 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు 55,140 ఓట్లు దక్కాయి. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి నన్నపనేని నరేందర్‌ బరిలో ఉన్నారు. వర్థన్నపేట నియోజకవర్గం... ఎస్సీ రిజర్వుడ్‌. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,54,269. వీరిలో పురుషులు 76,024. మహిళలు 78,236. గత రెండు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ గెలిచింది. 2014లో సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆరూరి రమేష్‌ 86,349 ఓట్ల మెజారిటీతో ఓడిరచారు. ఆరూరి రమేష్‌ 2009 ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్పూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయినా, 2014లో వర్ధన్నపేటలో విజయం సాధించారు. 2018 కూడా ఆరూరి రమేష్‌దే విజయం. 2018 ఎన్నికల్లో ఆరూరి రమేష్‌కు 1,31,252 ఓట్లు లభించాయి. టీజేఎస్‌ అభ్యర్ధి పగిడిపాటి దేవయ్య రెండో స్థానంలో నిలిచారు. 2023 ఎన్నికల్లోనూ వర్థన్నపేట టికెట్‌ను అరూరి రమేష్‌కే ఇచ్చింది బీఆర్‌ఎస్‌



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు