హైదరాబాద్, అక్టోబరు 18, (ఇయ్యాల తెలంగాణ );ఎన్నికల ముహూర్తం దగ్గర పడటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది ..కాంగ్రెస్ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది. కేండెట్ల తొలి జాబితా ప్రకటనతో టీపీసీసీ చీఫ్ రేవంత్ ను సొంత పార్టీ సీనియర్లు టార్గెట్ చేస్తూ..పార్టీని వీడుతున్నారు. అటు కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించిన షర్మిల ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్దమయ్యారు... పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల రెండో స్థానం నుంచి కూడా పోటీకి రెడీ అవుతున్నరంట. ఆ క్రమంలో షర్మిల ఇప్పుడు కొడంగల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుందితెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది..ఇప్పటికే తొలి లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్ ఫైనల్ లిస్టులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..మల్కాజ్ గిరి ఎంపీ , టీపీసీసీ చీఫ్ రేవంత్ కొడంగల్ నుంచి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ ఓడిపోయారు.అక్కడ గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్ది పట్నం నరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ అభ్యర్దిగా ఖరారయ్యారు ..పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో రేవంత్ కు ఇక్కడ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారైంది.. ఈ సమయంలోనే కొడంగల్ కేంద్రంగా సవిూకరణాలు మారుతున్నాయి ..వైటీపీ అధినేత్రి షర్మిల ఇప్పటికే పాలేరు నుంచి పోటీకి సిద్దమయ్యారు.. ఆమె రెండో స్థానంగా కొడంగల్ వైపు చూస్తున్నట్లు సమాచారం.వైటీపీపిని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సిద్దపడినా..రేవంత్ కారణంగానే షర్మిల ప్రతిపాదనలను కాంగ్రెస్ అమోదించలేదని చెబుతున్నారు .. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో షర్మిల జోక్యం వద్దంటూ రేవంత్ తన మద్దతు దారులతో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద బలంగా వాదించారంట..అయితే తాను తెలంగాణకే పరిమితం అవుతానని షర్మిల తేల్చి చెప్పారు. ఫలితంగా కాంగ్రెస్ తో షర్మిల ప్రయత్నాలు ఫలించలేదు.వాయిస్‌దీంతో, ఇప్పుడు రేవంత్ కు కొడంగల్ లోనే షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నారంట..తన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించారు ..తొలి నుంచి చెబుతున్నట్లుగా పాలేరు తో పాటుగా మరో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు . కొడంగల్ లో సామాజిక ` ప్రాంతీయ సవిూకరణలు తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్న షర్మిల..ఇప్పటికే అక్కడ సర్వేలు చేయించారనే ప్రచారం సాగుతోంది.రేవంత్ 2014లో కొడంగల్ లో గెలిచారు ..2018 ఎన్నికల్లో ఆయనకు షాక్ తగలింది .. ఈ సారి కూడా రేవంత్ ను ఓడిరచేందుక బీఆర్‌ఎస్ పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది .. తాజాగా రేవంత్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల కొడంగల్ లో పాదయాత్ర చేసిన సమయంలోనూ రేవంత్ ను టార్గెట్ చేసారు... ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆ సమయంలో షర్మిలకు మద్దతుగా నిలిచారు.ఇప్పుడు గుర్నాధరెడ్డి తిరిగి కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నా..షర్మిల బరిలో ఉంటే ఆయన పాత్ర కీలకం కానుంది. సామాజిక సవిూకరణాలు ...పార్టీల బలాబలాల్లో రేవంత్ వర్సస్ పట్నం మధ్య పోటీ.. షర్మిలకు కలిసి వస్తుందనేది వైటీపీ నేతల అంచనా... ఆ క్రమంలో అక్కడ సర్వేలు చేయంచుకుంటున్న షర్మిల .. వాటి ఫలితాల ఆధారంగా కొడంగల్ పైన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోందంటున్నారు
0 కామెంట్‌లు