విశాఖపట్నం అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ ):మళ్ళీ మోసం చెయ్యడానికే జగన్ బస్సు యాత్ర అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసిపి సామాజిక బస్సు యాత్రతో ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని,సామాజిక న్యాయం చేయని జగన్ ఎన్నికల కోసం పెత్తం దారు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని అన్నారని,బీసీ , ఎస్టీ మైనార్టీలకు తొక్కిపెట్టి పెత్తందారులు పేదవానికి మధ్య అంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయటం సిగ్గుచేటని అన్నారు.120 పథకాలను రద్దు చేశారు.27 పథకాలను మళ్ళించారని, ఎస్సీ, బీసీలను అనేకమందిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు బలి కొన్న వైసీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న బస్సు యాత్ర సామాజిక న్యాయం సాధ్యమవు తుందా అని ప్రశ్నించారు.