Ticker

6/recent/ticker-posts

Ad Code

బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్ల అనుసందాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

తిరుపతి, అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్ల ఎ టి పి అనుసందాన్న సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పరిశీలించి   పూర్తి చేయాలని   జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట వద్ద గల వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ కాంపౌండ్‌ లో గల  ఈవిఎం గోడౌన్‌ నందు ఎన్నికల   బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్ల అనుసంధాన ప్రక్రియను పరిశీలించి పలుసూచనలు చేశారు.  తిరుపతి జిల్లాకు అందిన బ్యాలెట్‌ యూనిట్‌ , కంట్రోల్‌ యూనిట్‌ బెల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు గత మాసం 28 నుండి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అనుసంధాన ప్రక్రియ(ఎ టి పి ) ప్రారంభించడం జరిగిన విషయం తెలిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఎన్నికలకమిషన్‌ ఎస్‌.ఓ.పి. నిబంధనల మేరకు ప్రక్రియ పూర్తిచేయాలని, సాకేంతిక లోపాలు ఉన్నవాటిని వేరు చేయాలని, వాటిని ఎన్నికల కమిషన్‌ కు తెలియజేసి వాటి స్థానంలో మార్పు జరగాల్సి ఉంటుందని సూచించారు. ఎ. టి. పి. పూర్తి అయిన వెంటనే (ఈఒఅ) ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని సూచించారు. వివి పాట్‌ డవ్మిూ సింబల్స్‌ చెక్‌ స్లిప్స్‌ క్రాష్‌ మిషన్‌ పరిశీలించారు.జిల్లా కలెక్టర్‌ పర్యటనలో డిప్యూటి కలెక్టర్‌ లీగల్‌ సెల్‌ మరియు ఇ వి ఎం ల నోడల్‌ అధికారి  శ్రీనివాసులు, డిప్యూటి కలెక్టర్‌ జి.ఎన్‌.ఎస్‌.ఎస్‌  కోదండరామిరెడ్డి, తహసిల్దార్లు, డిప్యూటి తహసిల్దార్లు , బెల్‌ ఇంజనీర్లు , సిబ్బంది వున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు