న్యూఢల్లీ, అక్టోబరు 10, (ఇయ్యాల తెలంగాణ ); గత వారాంతంలో ప్రపంచంలో మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో రష్యా`ఉక్రెయిన్ వార్ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది, ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది. ఈ టెన్షన్ ముడి చమురు ధరలకు మంట పెట్టింది.పశ్చిమాసియా ప్రాంతం మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యం. ప్రపంచ ముడి చమురు అవసరాల్లో మూడిరట ఒక వంతు ఈ ప్రాంతం నుంచే సప్లై అవుతుంది. ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ దాడుల తర్వాత, పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా హమాస్ సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి. గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే అత్యంత భయంకరమైన దాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇజ్రాయెల్`హమాస్ యుద్ధంలో రెండు వైపులా వెయ్యికి మందికిపైగా చనిపోయారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. హమాస్, 100 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుంది. సరిహద్దు పట్టణాల్లోని వీధుల్లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచం మొత్తం రెండు జట్లుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం, యుద్ధం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు.బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ముడి చమురు ధరలు ఒక్కసారే 5 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (చిుఎ) బ్యారెల్‌కు 5.11 శాతం పెరిగి 87.02 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ 4.99 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.76 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 3.20 డాలర్లు (3.28%) పెరిగి 87.78 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ చిుఎ క్రూడ్ ఆయిల్ 3.40 డాలర్లు (3.58%) పెరిగి 86.19 డాలర్ల వద్ద ఉంది.రష్యా, సౌదీ అరేబియా నుంచి ఉత్పత్తి కోతలతో ఇటీవల ముడి చమురు ధరలు మండిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షలను రష్యా సడలించడంతో, క్రూడాయిల్ రేట్లు గత వారంలో కూల్ అయ్యాయి. గత వారంలో, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 11 శాతం తగ్గింది, చిుఎ ఫూచర్స్ దాదాపు 8 శాతం క్షీణించింది. ఈ ఏడాది మార్చి తర్వాత, ఒక్క వారంలో
ముడిచమురు రేట్లు ఇంతలా తగ్గడం ఇదే అతి తొలిసారి. ఇప్పుడు, ఇజ్రాయెల్`హమాస్ పెడుతున్న టెన్షన్‌తో క్రూడ్ ఆయిల్‌లో అప్‌ట్రెండ్ మళ్లీ మొదలైంది.నిజానికి, ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి ఇరాన్‌తో ముడిపడి ఉంది. ఈ దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రత్యక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. తమకు ఇరాన్ తోడ్పాటు అందించిందని హమాస్ గ్రూప్ కూడా అధికారికంగా ప్రకటించింది. యుద్ధాన్ని ఇరాన్ ప్రేరేపిస్తోందని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది. ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఇరాన్‌లో భారీగా సంబరాలు జరిగాయి. ఇరాన్, హమాస్‌ను ప్రశంసించింది కూడా. ముడి చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇరాన్ నుంచి క్రూడ్ సప్లై మళ్లీ నిలిచిపోతుందని మార్కెట్ భయపడుతోంది. ఆ భయమే ముడి చమురు ధరల్లో మంట పెట్టింది.
0 కామెంట్‌లు