విశాఖపట్నం అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ ): విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు అమ్మవారు వైష్ణవీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేసారు. లోక కళ్యాణార్ధం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు రాజశ్యామల యాగం, శ్రీచక్ర నవావరణార్చన, దేవీ భాగవత పారాయణ నిర్వహిస్తున్నారు
0 కామెంట్‌లు