జీడిమెట్ల అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ): జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సూపర్ మాక్స్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత 18 నెలల క్రితం కంపెనీని యాజమాన్యం లాకౌట్ చేసింది. న్యాయం చేయాలంటూ అటు యాజమాన్యానికి, ఇటు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందన లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు 850 మంది అందోళనలోపాల్గోన్నారు. సియం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తామని కార్మికులు సిద్దమయ్యారు. జీటిమెట్ల పోలీసులు వారిని కార్మికులను అడ్డగించారు. కార్మిక నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
0 కామెంట్‌లు