Ticker

6/recent/ticker-posts

Ad Code

ప్రజల పన్నులతోనే పరిపాలన.. పాలకులు తెలుసుకోవాలి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ


హైదరాబాద్‌ అక్టోబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ ):ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతోనే పరిపాలన సాగిస్తున్నామని పాలకులు తెలుసుకోవాలని  హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. రాజకీయం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదని.. మిగతా అన్నిరంగాలు కలిస్తేనే పరిపూర్ణ సమాజంగా పరిగణించబడుతుందని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రజాడైరీ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సమాజంలో పలు రంగాలల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నవారికి అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రధాని నూతన విద్యావిధానం అమలుల్లోకి తేవడం వల్ల మాతృ భాష ప్రాముఖ్యత పెరిగిందని, తాను ఒకసారి అంతర్జాతీయ వేదికపై ప్రసంగించాల్సి వచ్చినప్పుడు హిందీలోనే మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాహితం కోరే వారిని, సమాజ అభివృద్ధికి పాటుపడే వారిని ప్రజాడైరీ పత్రిక సన్మానించడం సంతోషకరం అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రజాడైరీ సంపాదకుడు వి. సురేష్‌తో కలిసి ఎంటర్‌టైన్మైంట్‌ రంగంలో ప్రముఖుడిగా పేరు పొందిన రాజు ఎంటర్‌ టైన్మెంట్‌ ఈవెంట్స్‌ డేవిడ్‌ రాజు, సినీ నటుడు శివాజీ రాజా, చంద్రకాంత్‌, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, సోలార్‌ సైంటిస్ట్‌ రమేష్‌ తదితరులను ఘనంగా సన్మానించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు