Ticker

6/recent/ticker-posts

Ad Code

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ముగిసిన నారా లోకేష్‌ సిఐడి విచారణ

విజయవాడ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ):ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుకు సంబంధించి నారా లోకేష్‌ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటలకు ఆయన విచారణ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో 6 గంటల పాటు లోకేష్‌ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌ మెంట్‌ మార్పు, ప్రతిపాదిత రింగ్‌ రోడ్‌ సవిూపంలో హెరిటేజ్‌ భూములు కొనుగోలు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు పై సీఐడీ లోకేషన్‌ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఉదయం పూట విచారణ సమయంలో లోకేష్‌ ను ప్రధానంగా 16 ప్రశ్నలు అడగగా.. అందుకు ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా మధ్యాహ్నం కొత్త ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. అయితే.. దాదాపు అనేక ప్రశ్నలకు.. నాకు తెలియదు అని లోకేష్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు