Ticker

6/recent/ticker-posts

Ad Code

కౌన్సిలర్‌ భర్త లక్ష్మీరాజం హత్య కేసు తొమ్మిదిమంది నిందితులపై పీడి యాక్ట్‌

జగిత్యాల అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ );శాంతిభద్రతలకు, సామాజిక శాంతికి భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్‌ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ హెచ్చరించారు. ఆగస్టు 08 న కోరుట్ల పట్టణంలో  కౌన్సిలర్‌ భర్త లక్ష్మీరాజం హత్య కేసులో 9 గురు నిందితులపై సోమవారం పీడి ఆక్ట్‌ అమలు చేయడం జరిగిందని అన్నారు. పిడి ఆక్ట్‌  నమోదు చేసిన ఉత్తర్వుల కాపీని నిందితులకు కరీంనగర్‌ జైల్లో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని  జిల్లా ఎస్పీ తెలిపారు. విత్తనాల నాగరాజు, విత్తనాల తిరుపతి, కాసుల వంశీ ప్రసాద్‌, పిల్లి సత్యనారాయణ, గుడ్ల విశాల్‌, కాసుల మధుమోహన్‌, మర్త నరసింహ, మారుపాక ప్రభాస్‌, శ్రీరాముల దీపక్‌  లపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఆగస్టు  8 నాడు కోరుట్ల పట్టణంలోని కార్గిల్‌ చౌరస్తా కి ఎదురుగా ఉన్న  శంకర్‌ టీ స్టాల్‌ లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌ ధరించి టీ తాగడానికి వచ్చిన స్థానిక కోరుట్ల కౌన్సిలర్‌ భర్త లక్ష్మీరాజంపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి మోటార్‌ సైకిల్‌ పై పారిపోయారు.  గాయాల పాలైన లక్ష్మీరాజంను కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు.  అదే రోజు మృతుని భార్య  పోగుల ఉమారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొమ్మిది  మందిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించడం జరిగింది.  ఇందులో 9 మందిని పైన సోమవారం పీడి యాక్ట్‌ నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నియంత్రణ చట్టం 1986 (చట్టం సంఖ్య 1/1986), తెలంగాణా నియంత్రణ చట్టం ( సవరణ చట్టం సంఖ్య 13/2018)  ప్రకారం వీరు  నేరాలకు పాల్పడే నేరస్తుని గా నిర్ధారించి, వీరి బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం పి.డి. యాక్ట్‌ పెట్టడం జరిగిందని పై నిందితులు సాధారణ ప్రజల మనసుల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ,ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు, సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నారని.ఈ నిందితులపై గతంలో  కేసులు నమోదు కావడం జరిగిందని, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై పిడి యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ పీడీ యాక్ట్‌ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ రవీంద్ర రెడ్డి, కోరుట్ల సీ.ఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సై కిరణ్‌ కుమార్‌  లను జిల్లా ఎస్పీ అభినందించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు