Ticker

6/recent/ticker-posts

Ad Code

పెరుగుతున్న భూతాపం పొంచివున్న పెనుముప్పు

 అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ );ప్రపంచంలో ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలకు మరో 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ... ఉత్తర భారత్‌తో సహా తూర్పు పాకిస్థాన్‌ లోని కోట్లాది మంది ప్రజలు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని... దాదాపు 220 కోట్ల మంది ప్రజల విూద ప్రభావాన్ని చూపుతుందని ప్రొసీడిరగ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడవిూ ఆఫ్‌ సైన్సెస్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భూ గ్రహం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడెక్కుతున్నట్లు సూచించింది. ఈ తీవ్రమైన వేడి కారణంగా వడదెబ్బ.. గుండెపోటు ముప్పు పొంచి ఉంటుందని.. అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ఈ వేడి వాతావరణం కారణంగా.. మనుషులు తమ శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబర్చుకునే వీలు ఉండదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల్లో ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగినా.. కోట్లాది మంది తీవ్రమైన వేడి.. గాల్లో అధిక తేమతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇదంతా కూడా పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వివరించింది. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు సూచించారు. మార్పులు చేయకపోతే మధ్య తరగతి, అల్పాదాయ దేశాలు ఎక్కువగా నష్టపోతాయని వెల్లడిరచారు.భూతాపం తగ్గించడం మనవల్లే సాధ్యం అంటున్నారు నిపుణులు. సింపుల్‌గా ఐదు పద్ధతులు పాటిస్తే చాలు గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చు అంటున్నారు.భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రపంచంలోని చాలామంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు.వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్‌ గవర్నమెంట్‌ ప్యానెల్‌’(ఐపీసీసీ) భూమి ఉపరితల ఉష్ణోగ్రత 12 ఏళ్లలో పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నప్పటి దాని కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరవచ్చని తెలిపింది.భూతాపం ఆ స్థాయికి పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుంచే చేయడం అవసరమని చెప్పిందిభూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ దాటకుండా దానిని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు.ఈ నివేదిక రూపొందించిన రచయిత ఆరోమర్‌ రేవీ ‘‘మనం చాలా మామూలుగా చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, భూతాపాన్ని చాలావరకూ పరిమితం చేయవచ్చని’’ అంటున్నారు.రోజువారీ కార్యకలాపాల్లో మనం చేసుకోవాల్సిన కొన్ని మార్పులను ఆయన సూచించారు.కారు ఉపయోగించకుండా నడిచి వెళ్లడం, లేదా సైకిలుపై వెళ్లడం, అది కూడా కుదరకపోతే ప్రజా రవాణాను ఉపయోగించడం చాలా మంచిది.చేయడం వల్ల మనం ఫిట్‌గా ఉండడంతోపాటు కర్బన ఉద్గారాలు విడుదల కావడం కూడా తగ్గుతుంది.నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లాలి అనే దారులు మనమే ఎంచుకోవచ్చు.’’ప్రజా రవాణాను ఉపయోగించే అవకాశం లేకుంటే, మనం ఎన్నుకునే రాజకీయ నాయకులే మనకు ఆ అవకాశాలు అందించేలా చూసుకోవాలి’’ అని ఐపీసీసీ కో`ఛైర్మన్‌ అంటారు.శిలాజ ఇంధనాలు, విద్యుత్‌ ఆదా చేయాలి.బట్టలు ఆరేయడానికి వాషింగ్‌ మెషిన్‌ డ్రయ్యర్‌ ఉపయోగించడం కంటే ఒక తాడుపై వాటిని ఆరేయడం మంచిది.చల్లబడడానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్‌ ఆదా అవుతుంది.చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా విూ పైకప్పుకు ఫైబర్‌ లేదా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి వాటితో మరింత రక్షణ కల్పించడం మంచిది. దానివల్ల విద్యుత్‌ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు