జగిత్యాల అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):రాబోయే శాసనసభ ఎలక్షన్స్ కు ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించిన సందర్భంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ ల పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ అధికారులు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎలక్షన్స్ కు ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించిన సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలో, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో ఉండటం జరిగిందని ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్ సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. . ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించిన అంశాలపై ఎస్పీ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ కి వారికీ అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు, స్వతంత్ర అభ్యర్థులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ టీమ్స్ తరచూ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఏదైనా వైలేషన్ జరిగిందని ప్రజల నుండి గాని మరి ఇతర మాధ్యమాల ద్వారా గాని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలని సూచించారు. ఈ టీమ్స్ ముఖ్యంగా డబ్బు, మద్యం, గిఫ్ట్స్, గంజా, మరే ఇతర ప్రలోభాలకు గురిచేసి వస్తువులు రవాణా జరిగిన గుర్తించే విధంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రభాకర రావు,ఎస్భీ ఇన్స్పెక్టర్ లు నాగేశ్వర రావు,ఆర్‌ఐ జానీ మియా, ఎఫ్‌ఎస్టీ,ఎస్‌ఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు