హైదరాబాద్ అక్టోబర్ 10 (ఇయ్యాల తెలంగాణ ): మన కండ్ల ఎదుటపాము కనిపిస్తే.. అక్కడ్నుంచి పరుగెడుతాం. అంతటి భయంకరమైన కింగ్ కోబ్రా.. ఓ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది.ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. షూలోకి దూరింది నాగుపాము. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
0 కామెంట్‌లు