Ticker

6/recent/ticker-posts

Ad Code

శ్రీధర్‌ బాబు హయాంలోనే అభివృద్ధి జరిగింది....

 

 కమాన్‌ పూర్‌ అక్టోబర్ 5 (ఇయ్యలతెలంగాణ ): రామగిరి మండలం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో శ్రీధర్‌ బాబు హయాంలోనే అభివృద్ధి జరిగిందని మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌ అన్నారు. సెంటినరీ కాలనీ ఐ ఎన్‌ టి యు సి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొట్ల తిరుపతి యాదవ్‌ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌  ప్రజా ఆశీర్వాద యాత్రలో పుట్ట మధు మాట్లాడుతూ రామగిరి మండలం ఏమాత్రం అభివృద్ధి జరగలేదని అనడంలో నిజం లేదని తిరుపతి యాదవ్‌ అన్నారు. రామగిరి మండలం లో జేఎన్టీయూ కళాశాల అన్ని మండలాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు హార్టికల్చర్‌ కళాశాల రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం తోపాటు రోడ్లు పాఠశాలలు కట్టించిన ఘనత శ్రీధర్‌ బాబుకి దక్కిందని అన్నారు. అలాగే ఎందరో నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. అధికార పార్టీలో ఉండి జడ్పీ చైర్మన్‌ స్థాయిలో సింగరేణి ప్రభావిత గ్రామాల రామయ్య పల్లె ఆదివారం పేట రాజాపూర్‌ లగ్నాపూర్‌ గ్రామ రైతులకు ఎటువంటి న్యాయం చేశావు బహిరంగ సభకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. శ్రీధర్‌ బాబు ఎన్నోమార్లు భూనిర్వాసితుల కోసం అసెంబ్లీలో లేవనెత్తి భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరిన ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. మా నాయకుని పై నిందలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రామగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోట చంద్రయ్య మంథని నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్‌ ఎంపీటీసీలు కొప్పుల గణపతి కొట్టే సందీప్‌ మాజీ ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్‌ సెంటినరీ కాలనీ కాంగ్రెస్‌ పార్టీ టౌన్‌ అధ్యక్షుడు కాటనీ సత్యం నాయకులు కండె పోషం  మంథని రవీందర్‌ ఉడుత శంకర్‌ నరేష్‌ యాదవ్‌ సిద్ధం రామ్‌ నారాయణ ఓదేలు శ్రీధర్‌ వీణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు