ఖమ్మం అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో ఉన్న కస్తూర్బా విద్యాలయ వసతి గృహంలో గుర్తుతెలియని ఆగంతకులు చొరబడ్డారు. ముగ్గురు ఆగంతకులు చూసి విద్యార్థులు భయాదోళనకు గురి అయ్యారు. గత మూడు రోజుల క్రితం కూడా వసతి గృహంలోకి వచ్చినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు వాపోయ్యారు. భయంతో వసతి గృహంలోనే విద్యార్థినుల అరుపులు చేశారు. అప్పడికే భయంతో పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థినులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
0 కామెంట్‌లు