విజయవాడ (ఇయ్యాల తెలంగాణ ):ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. నేడు అమ్మవారు భక్తులకు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు, పోలీసులకు, దుర్గ గుడి సిబ్బందికి వాగ్వాదం నెలకొంది.
ఇంద్రకీలాద్రి పై పోలీసుల అత్యుత్సాహం చూపించారని సిబ్బంది మండిపడ్డారు. విధుల నిర్వహణకు వచ్చిన ఆలయ సిబ్బందిని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఘాట్ రోడ్డు లో సిబ్బంది కి ఇక్కట్లు తప్పలేదు. గుర్తింపు కార్డులు, పాస్ లు చూపించినా పంపకపోవడంతో పోలీసుల తీరు పై ఆలయ సిబ్బంది మండిపడ్డారు