రాజన్న సిరిసిల్ల 4 (ఇయ్యాల తెలంగాణ ): దేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సవిూకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృతంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు కానుక బతుకమ్మ చీరలను ఏటా ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఈ చీరల పంపిణీ తో సిరిసిల్ల లోని పవర్ లూమ్ నేత కార్మికుల కుటుంబాలకు నిరంతరం ఉపాధి లభించింది ఆర్థికంగా బాగుపడ్డాయన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ తో పాటు మహిళా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. న్యూట్రిషన్ ,కేసీఆర్ కిట్ , గృహలక్ష్మి వంటి అనేక కార్యక్రమాలను మహిళల పేరుతోనే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గడపగడపకు సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల సర్కార్ గా పేరుపొందిందన్నారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట మంత్రి కె తారకరామారావు నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో దేశానికే నమూనాగా ఈ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే బతుకమ్మ పండుగకు జిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులం అందరం బతుకమ్మ చీరలు ధరించి వేడుకల్లో పాల్గొంటామని చెప్పారు.రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వ ప్రత్యేక చొరవతో బతుకమ్మ పండుగ ప్రపంచ పండుగగా ఆవిర్భవించిందన్నారు. ఒకప్పుడు హైదరాబాదులో ఆంధ్ర మహిళలు బతుకమ్మ ఆడాలంటే నామోషీగా ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఉత్సాహంగా, భక్తితో గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ వేడుకలను ఆడుకుంటున్నారని అన్నారు. తెలంగాణకే ప్రత్యేకించిన బతుకమ్మ పండుగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. సహజంగా దేవునికి పూలను పెట్టి పూజిస్తామని, బతుకమ్మ పండుగ లో మాత్రం పూలకే పూజలు చేసే గొప్ప సంస్కృతి మనది అన్నారు. బతుకమ్మ పండుగకు ప్రతి ఏటా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తుందన్నారు. ఆడబిడ్డలకు కానుకగా అందించే బతుకమ్మ చీరల ద్వారా సిరిసిల్లలోని పవర్లూమ్ నేత కార్మికులు సుస్థిర ఆదాయం పొందుతున్నారని అన్నారు. గతం కంటే ఆకర్షణీయం గా బతుకమ్మ చీరలను తీర్చిదిద్దామని చెప్పారు.ఈ బతుకమ్మకు ప్రభుత్వం 25 రంగులలో, 25 డిజైన్లలో, 525 రకాల చీరలను రూపొందించి పంపిణీ చేస్తుందన్నారు. రెండు రోజులలో అందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు.మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూబతుకమ్మ చీరల పంపిణీ తో తెలంగాణ ఆడబిడ్డల మోముల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, అదే సమయంలో నేతన్న కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అన్నగా ,మేనమామగా తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా అందజేస్తున్నారని తెలిపారు . బతుకమ్మ చీరల ఆర్డర్ లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడి ఆత్మగౌరవంతో నేతన్నలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని మహిళా లోకాన్ని ఆమె కోరారు.కార్యక్రమంలోగ్రంధాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య , నాప్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్,సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డిఆర్ డిఓ నక్క శ్రీనివాస్, చేనేత , జౌలి శాఖ జిల్లా అధికారి సాగర్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ ఆయాజ్,సెస్ డైరెక్టర్ లుస్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు