Ticker

6/recent/ticker-posts

Ad Code

అంగన్వాడి, ఆశ వర్కర్లు ను అరెస్టు చేసిన పోలీసులు

 

కోరుట్ల, అక్టోబర్‌ 03 (ఇయ్యాల తెలంగాణ ); జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం నైపథ్యంలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా నియోజకవర్గం లోని కోరుట్ల, మెట్‌ పల్లి అంగన్వాడీలు, ఆశ వర్కర్లు ,మధ్యాహ్నం భోజనం వర్కర్స్‌ లను మంగళవారం ఉదయం కోరుట్ల, మెట్‌ పల్లి పోలీసులు అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. తమ హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసన  చేస్తుంటే తమని అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నట్లు అంగన్వాడి, ఆశా వర్కర్లు, మధ్యాహ్నం భోజనం వర్కర్స్‌ యూనియన్‌ నేతలు తెలిపారు. ఈ అరెస్టులో అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, అంగన్వాడి టీచర్లు హిమగిరి, సుజాత, మధ్యాహ్నం భోజన వర్కర్స్‌, ఆశ వర్కర్లు అసోసియేషన్‌ నాయకురాలు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు