అక్టోబర్ 5 (ఇయ్యాల తెలంగాణ ):ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. బుధవారం సాయంత్రం మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. యువత కేరింతల నడుమ ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు అనుదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. నేను సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మ్యాడ్ విషయానికొస్తే ట్రైలర్ నిజంగానే మ్యాడ్ గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్ళ లాగా లేరు. చాలా బాగా చేశారు. భీమ్స్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ విని నాకు తెలియకుండానే కాలు కదుపుతున్నాను. షామ్ దత్ గారి వర్క్ సూపర్బ్. హారిక, చినబాబు గారు, వంశీ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను. సిద్ధు నీ టిల్లు స్క్వేర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. శ్రీలీల ఒకేసారి చాలా సినిమాలు చేస్తుంది. నేను తన డ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అవుతాను. ఆల్ ది బెస్ట్.’’ అన్నారు.సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘సితార సినిమా అంటే నా సినిమా లాంటిది. మొదట కళ్యాణ్ మ్యాడ్ స్టోరీ లైన్ ని నాకు చెప్పినప్పుడు, చాలా ఎంజాయ్ చేస్తాను. ఇది ఖచ్చితంగా చేయాల్సిన అప్పుడే అనిపించింది. ఈరోజు కళ్యాణ్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నితిన్, రామ్, సంగీత్, గౌరీ, అనంతిక, గోపిక.. విూరందరూ సితార బ్యానర్ నిర్మించిన సినిమాలో భాగం కావడం లక్కీ. సితార వాళ్ళు సినిమా గురించి తప్ప ఖర్చు గురించి గానీ, టైం గురించి గానీ పట్టించుకోరు. సినిమా కరెక్ట్ గా రావాలని మాత్రమే చూస్తారు. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్న చినబాబు గారి కుమార్తె హారికకి ఆల్ ది బెస్ట్. టిల్లు స్క్వేర్ కి కళ్యాణ్ కూడా ఒక రైటర్. అతను ఎలా ఆలోచిస్తాడో, ఎలా రాస్తాడో నాకు తెలుసు. ఈ సినిమా విూ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నాగవంశీ గారు ఇప్పటికే చెప్పినట్టు జాతిరత్నాలుకి ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తారు. దుల్కర్ గారు చాలా నైస్ పర్సన్. చినబాబు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇవాళ గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారంట. చినబాబు గారి గొంతులో నేను అంత ఎక్సైట్ మెంట్ చాలారోజుల తర్వాత విన్నాను. సాంగ్ సూపర్ వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయి అన్నారు ఆయన.’’ అన్నారు.శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘రీసెంట్ గా గుంటూరు కారం షూటింగ్ లొకేషన్ లో నేను అటుఇటు నడుస్తుండగా నిర్మాతలు మ్యాడ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ సినిమా గురించి తెలుసుకున్నాను. ఈ సినిమా ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. నాకు జాతిరత్నాలు చూసినప్పటి నుంచి ఇలాంటి హిలేరియస్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను సితారలో ఆదికేశవ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాతో అలరిస్తాం. ఈ మ్యాడ్ సినిమా మ్యాడ్ ఉంటదంట. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
0 కామెంట్‌లు