రాజమండ్రి అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ );టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. బయటకి వచ్చిన వెంటనే చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. తాను నిర్దోషిని అని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతానని అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే సమయానికి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రాజమండ్రి పరిసరాలు కోలాహలంగా మారాయి. తరువాత అయన భారీ కార్ల కాన్యాయితో తాడేపల్లికి బయలుదేరారు